మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి పల్లకిసేవ వైభవంగా జరిగింది. అమ్మవారితో కళ్యాణానికి ముందే గంగాదేవితో స్వామివారి వివాహం జరిగిందన్న విషయం తెలుసుకున్న జ్ఞానప్రసూనాంబదేవి.. అలక ముఖంతో అద్దంలో చూస్తూ ముందు పల్లకిలో వెళ్లింది. అమ్మవారిని బుజ్జగిస్తూ వెనుక పల్లకిలో స్వామి వారు రావడం ఈ ఉత్సవం విశేషం. ఆదిదంపతుల పల్లకి సేవను కనులారా తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో.. శ్రీకాళహస్తి భక్తజన సంద్రంగా మారింది .
ఇదీ చదవండి:
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వైభవంగా ధ్వజావరోహణం