ETV Bharat / state

రోడ్డు విస్తరణ కోసం.. ఇంటినే వెనక్కు జరిపాడు.. - చిత్తూరులో ఇంటిని వెనక్కి జరుపుతున్న యజమాని

road extension: రోడ్డు విస్తరణలో ఇల్లు పోతుందంటే మీరు ఏం చేస్తారు.. కొందరైతే తమ ఇంటిని కూల్చొద్దని అధికారులను వేడుకుంటారు.. మరికొందరు ప్రత్యమ్నాయం చూపమంటారు.. ఇంకొందరు నష్టపరిహారం చెల్లించాలంటారు.. కొందరేమో ఏమీ చేయలేక పొట్టచేతపట్టుకుని మరో చోటుకు వెళ్లిపోతారు.. కానీ యజమాని ఎంతో ఇష్టంగా కట్టుకున్న తన ఇంటిని విస్తరణలో కూలకుండా కాపాడుకున్నాడు.. అలా అని ఏ అధికారి దగ్గరికీ వెళ్లలేదు.. ఇల్లు కూల్చొద్దని కోరలేదు.. అదెలాగో తెలుసుకుందామా..?

house back in chittoor
ఇల్లు వెనక్కి జరుపుతున్న జయమాని
author img

By

Published : Mar 3, 2022, 2:50 PM IST

road extension: రహదారి విస్తరణలో తన ఇల్లు పోతోందని తెలిసిన ఓ యజమాని.. ఆ ఇంటికి కాపాడుకునేందుకు ఓ ఉపాయం ఆలోచించాడు. ఏకంగా ఆ ఇంటిని వెనక్కు జరిపే ప్రయత్నం మొదలుపెట్టాడు.

road extension: చిత్తూరు జిల్లాలో నాయుడుపేట - పూతలపట్టు జాతీయ రహదారి ఆరు లేన్లుగా విస్తరిస్తున్నారు. ప్రస్తుతం రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వైపు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనుల వల్ల రేణిగుంట మండలం గుత్తివారిపల్లి వద్ద రోడ్డుకు ఆనుకొని ఉన్న రెండు అంతస్తుల భవనం కూల్చేయాల్సి వస్తోంది. ఇల్లును కోల్పోవడం ఇష్టం లేని ఇంటి యజమాని కె.తారకరామ.. జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి.. దాన్ని 49 అడుగుల మేర వెనక్కు జరిపిస్తున్నాడు. బిహార్‌ నుంచి వచ్చిన కూలీలు 320 జాకీలతో పనులు మొదలుపెట్టారు. పూర్తయ్యేందుకు మరో 2 నెలల సమయం పడుతుందని చెప్పారు. ఇందుకు రూ.20 లక్షలు ఖర్చవుతుందని యజమాని తెలిపారు.

ఇదీ చదవండి: Environmental Protection: ఆలోచనకు పదును.. మట్టితో అద్భుతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.