Attempted to rape: ఎనిమిదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. నగరం నడిబొడ్డున ఉన్న చామంతిపురంలో ఒంటరిగా ఆడుకుంటున్న ఓ బాలికను అక్కడే నివాసముంటున్న ధనపాల్ అనే వృద్ధుడు తినుబండారాలు ఇస్తానని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి... అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టూ పక్కన ఉన్న జనం అక్కడికి చేరుకుని వృద్ధుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. వృద్ధుడు ధనపాల్ మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి: