Raids on Mining Areas and Granite seized: గనులశాఖ దాడుల్లో రూ.5 కోట్ల విలువైన గ్రానైట్ స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా డీఎంజీ వెంకటరెడ్డి వెల్లడించారు. మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో జిల్లాలోని మైనింగ్ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. చిత్తూరు డీఎంజీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో.. 4 బృందాల మైనింగ్ ప్రాంతాలల్లో దాడులు నిర్వహించాయి. కుప్పం అటవీప్రాంతంలోని మైనింగ్ ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. శాంతిపురం, ద్రవిడ వర్సిటీ ప్రాంతంలోని మైనింగ్‌పై దాడులు చేసి 40 గ్రానైట్ బ్లాక్స్, 6 కంప్రెషర్లు, 2 హిటాచీలు సీజ్ చేశారు. గనులశాఖ దాడుల్లో రూ.5 కోట్ల విలువైన గ్రానైట్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎంజీ వెల్లడించారు. సీజ్ చేసిన ఖనిజాల వేలానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు డీఎంజీ వెంకటరెడ్డి తెలిపారు.
అక్రమ మైనింగ్ నివారణకు చెక్‌పోస్టులు: డీఎంజీ
అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపినట్లు డీఎంజీ వెంకటరెడ్డి తెలిపారు. మైనింగ్‌ను అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ద్వారా ప్రత్యేక నిఘా పెంచామన్నారు. రెవెన్యూ, పోలీసు, గనులశాఖ అధికారులతో మొబైల్ తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి..Deputy CTM: 'పండుగ వేళ జాగ్రత్తలు తప్పనిసరి...మాస్కు లేకపోతే జరిమానా'