ETV Bharat / state

కరవు పొమ్మంటోంది.... పల్లె కన్నీరు పెడుతోంది.... - రైతుల

వర్షాభావంతో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో కరవు తాండవం చేస్తోంది. ఖరీఫ్ సాగు సమయం దాటిపోయినా వానలు లేక రైతులు విత్తనం నాటలేదు. ఇక ఇప్పుడు వర్షాలు పడినా ఏ ప్రయోజనం ఉండదని వలస బాట పడుతున్నారు.

తంబళ్లపల్లెలో తీవ్ర వర్షాభావం.. వలసపోతున్న రైతులు
author img

By

Published : Jul 22, 2019, 10:52 AM IST

Updated : Jul 22, 2019, 11:15 AM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారం నియోజకవర్గంలో ఖరీఫ్ పంటలు సాగుచేసే పొలాలు 39వేల హెక్టార్లు ఉన్నాయి. అయితే ఇప్పటికి అక్కడ కేవలం 5వేల హెక్టార్లలోనే విత్తనాలు వేశారు. కొందరు రైతులు దుక్కి దున్ని వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకూ వానలు సరిగ్గా పడక నిరాశచెందిన వారు.. ఇకపై వర్షాలు పడినా విత్తనాలు వేసే సమయం దాటిపోయిందని చెప్పారు. వర్షాభావంతో చెరువులు, కుంటలు, వాగులు, డ్యాములు వెలవెలాపోతున్నాయి. ఇక ఇక్కడే ఉండి చేసేదేం లేదని కొంతమంది అన్నదాతలు వలసలు వెళ్తున్నారు. హంద్రీ-నీవా కాలువలో కృష్ణా జలాలు ప్రవహిస్తే కొంతవరకు కరవు నుంచి విముక్తి లభిస్తుందని రైతన్నలు అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి.

వృద్ధ దంపతులు మృతి.. ఆత్మహత్యా! హత్యా!

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_31_21_sakambari_ammavaram_p_v_raju_av_AP10025_SD తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మ అమ్మవారు శాకాంబరీ గా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాసం సంధర్భంగా అమ్మవారిని సుమారు రెండు టన్నుల కూరగాయలు, ఆకు కూరలతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.Conclusion:ఓవర్
Last Updated : Jul 22, 2019, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.