కరోనా లాక్ డౌన్ మొదలు.. అన్ లాక్ వరకు ప్రజలకు సేవలు అందించి వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కృషి చేసిన పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్కోచ్ సంస్థ ఏటా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పోటీల్లో.. ఈ ఏడాది చిత్తూరు పోలీసులు వెండి పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మేరకు దిల్లీ నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో స్కోచ్ గ్రూప్ ఛైర్మన్ సమీర్ కొచ్చర్ చిత్తూరు పోలీసులకు పతకాన్ని ప్రధానం చేశారు. జిల్లాకు 'రెస్పాన్స్ టు కొవిడ్-19'కు స్కోచ్ సంస్థ వెండి పతకాన్ని అందజేశారు.
కరోనా కాలంలో చిత్తూరు పోలీసుల సేవలు..
కరోనా కాలంలో వైరస్ వ్యాపించకుండా ప్రతి రోజు అవగాహన కార్యక్రమాలు, మైక్ ద్వారా ప్రచారం చేశారు. రెడ్ జోన్లలో నిఘాను పటిష్టం చేయడమే కాకుండా అందరూ నిబంధనలను పాటించేలా చేశారు. సుమారు 2 లక్షల మంది వలసదారులకు, బీదలు, అనాథలకు ఆహారం అందించారు. రెవెన్యూ, ఆరోగ్య సిబ్బందితో కలిసి అంతరాష్ట్ర, జిల్లా సరిహద్దులోని 102 చెక్ పోస్టులలో విధులు నిర్వహించారు. కరోన సమయంలో పోలీసు అధికారులు, సిబ్బందిలో 638 మందికి వైరస్ బారిన పడగా.. కోలుకుని మళ్లీ సేవలు అందించారు. ఇందుకుగాను వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
ఇవీ చూడండి...