ETV Bharat / state

'పవిత్రమైన తిరుమల లడ్డూలను ఓట్ల స్లిప్పులతో పంచడమేంటి ?' - లోకేశ్ తాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో ఎన్నికల‌ సందర్భంగా పవిత్రమైన తిరుమల లడ్డూలను ఓట్ల స్లిప్పులతో పాటు పంచటంపై తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ మండిపడ్డారు. రేషన్ బియ్యం తరలించే వ్యాన్లలో ల‌డ్డూల‌ను త‌ర‌లించి ఎన్నిక‌ల నిబంధ‌న‌లు ఉల్లంఘించారన్నారు.

'పవిత్రమైన తిరుమల లడ్డూను ఓట్ల స్లిప్పులతో పాటు పంచడమేంటి ?'

author img

By

Published : Feb 19, 2021, 6:21 PM IST

పవిత్రమైన తిరుమల లడ్డూలను ఓట్ల స్లిప్పులతో పాటు పంచి శ్రీవారికి మహా అపచారం తలపెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆక్షేపించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలో ఓ అభ్యర్థి తనకు ఓటు వేసి గెలిపించాలంటూ గ్రామస్థులకు తిరుమల లడ్డూలు పంచుతూ ప్రచారం నిర్వహించటంపై ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్​కు వైకాపా నేతలకు ఎన్నికలపైనే తప్ప ఏడుకొండలవాడిపై భక్తి లేదని దుయ్యబట్టారు.

రేషన్ బియ్యం తరలించే వ్యాన్లలో ల‌డ్డూల‌ను త‌ర‌లించి ఎన్నిక‌ల నిబంధ‌న‌లు ఉల్లంఘించారన్నారు. ఎస్సీల‌కు 5 లడ్డూలు, ఇత‌రుల‌కు 10 లడ్డూల చొప్పూన పంపిణీ చేసి కుల‌వివ‌క్ష చూపారని ధ్వజమెత్తారు. హిందువుల‌కు అత్యంత ప‌విత్రమైన ల‌డ్డూల‌ను ఓట‌ర్లకు తాయిలాలుగా పంచిన అభ్యర్థిని పోటీకి అన‌ర్హులుగా ప్రక‌టించాలని డిమాండ్‌ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు అవస్థలు పడుతుంటే.. తొండవాడలో ఓటు కోసం శ్రీవారి లడ్డూలను పంచటంపై తితిదే అధికారులు చ‌ర్యలు చేప‌ట్టాలన్నారు.

ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి

పవిత్రమైన తిరుమల ప్రసాదాన్ని ఓటర్ స్లిప్పులతో పాటు పంచటం ముమ్మాటికీ రాజకీయమేనని తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్ విమర్శించారు. తొండవాడ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

ప్రలోభాల పర్వం..ఓటర్లకు తిరుమల లడ్డూల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.