నివర్ తుపాన్‌తో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆరా తీశారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ దశదిన కర్మ కార్యక్రమం బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో ఆదివారం జరిగింది. కార్యక్రమానికి నారా లోకేష్ సహా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, శాసన మండలి సభ్యుడు దొరబాబు, తెదేపా నేతలు శ్రీనాథ్ రెడ్డి, భానుప్రకాష్ హాజరై నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా తెదేపా నేతలతో లోకేశ్ మాట్లాడారు. తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన పుంగునూరు నియోజకవర్గం ప్రస్తావన రాగా... నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త శ్రీనాథరెడ్డి లోకేశ్‌కు వివరాలు వెల్లడించారు. నియోజకవర్గంలో ఇప్పటికే చాలాచోట్ల జనజీవనం స్తంభించిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శ్రీనాథ రెడ్డి తెలియజేశారు.
ఇదీ చదవండి: