చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ముడిపల్లి గ్రామంలో అధికారులు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. బలవంతంగా తమ భూములు లాక్కొని ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం మంచిదేనని.. కానీ పేదవారైన తమ వద్ద నుంచి భూములు లాక్కోవడం సరికాదని వాపోయారు.
తమ ఆధీనంలో ఉన్న భూమిలో ఎలా పనులు చేస్తారంటూ అధికారులపై ఆగ్రహించి.. జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ గ్రామస్థులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వటంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చదవండి..