ఎస్సీ వర్గీకరణ అమలులో ఉన్న ఐదేళ్ల కాలంలోనే 20 వేల ఉద్యోగాలలో మాదిగలు స్థిరపడ్డారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ గుర్తు చేశారు. ఎమ్మార్పీఎస్తోనే మాదిగ సామాజికవర్గం ధైర్యంగా జీవిస్తూ ఆర్థికంగా బలపడి రాజకీయంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. వర్గీకరణ పోరాటాలే కాకుండా గుండెజబ్బులకు శస్త్రచికిత్సలు, ప్రత్యేక ప్రతిభావంతుల పింఛన్ల పెంపునకు కృషి చేస్తున్నామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా దోహదపడేలా... కులమతాలకతీతంగా మానవతావాదంతోనే పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయి నుంచి ఎమ్మార్పీఎస్ను బలోపేతం చేసి ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనన్నారు. వర్గీకరణ ఒక్కటే కాకుండా ఎస్టీ, బీసీల రాజ్యాధికారం కోసం సమష్టిగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి. 'రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలి'