చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా... వాటిలో 10 స్థానాలకు ఎన్నికలు నిలిపివేశారు. ఇందులో వాల్మీకిపురం 1,2,3,4 ఎంపీటీసీ స్థానాలతో పాటు చింతపర్తి 1,2 చింతలవారిపల్లి, మంచూరు, నగిరి మడుగు, టి.సాకిరేవుపల్లిలో ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిలిపేశారు. కలికిరి మండలంలో పత్తేగడ, కలకడ మండలంలో కలకడ, కంభంవారిపల్లి మండలంలో తిమ్మాపురం, మారెళ్ల, జిల్లెల్ల మందా, గాలివారిపల్లి, తీతవ గుంటపల్లి, గ్యారంపల్లి స్థానాలకు ఎన్నికలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా పీలేరు నియోజకవర్గంలో 80 ఎంపీటీసీ స్థానాలకు గాను 62 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: