ETV Bharat / state

'తారకరత్న గుండె, కాలేయం బాగున్నాయి.. మెదడుకు చికిత్స'

MOVIE ACTOR THARAKARATNA HEALTH UPDATES: తారకరత్న ఆరోగ్యం రోజురోజుకి మెరుగుపడుతోందని.. గుండె, కాలేయం ఇతర అవయవాలన్నీ బాగున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు మెదడుకు సంబంధించి చికిత్స జరుగుతున్నట్లు వెల్లడించారు.

తారకరత్న
తారకరత్న
author img

By

Published : Feb 3, 2023, 3:48 AM IST

MOVIE ACTOR THARAKARATNA HEALTH UPDATES: సినీ నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుతో గత ఆరు రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్యం రోజురోజుకి మెరుగుపడుతోంది. ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి నేటి వరకు ప్రత్యేక వైద్య బృందం ఆయనకు ప్రతి రోజు చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలో తారకరత్న గుండె, కాలేయం ఇతర అవయవాలన్నీ బాగున్నాయని.. మెదడుకు సంబంధించి చికిత్స జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ ఈరోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సంప్రదింపులు జరిపారు. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు. నందమూరి తారకరత్నకు ఇక్కడి వైద్యులు వెంటిలేటర్ సాయంతో అత్యున్నత వైద్య సేవలను అందిస్తూ వస్తున్నారు. తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు బులిటెన్ విడుదల చేస్తూ.. ఆయన అభిమానులకు ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తున్నారు.

మరోపక్క తారకరత్న గుండెతో పాటు ఇతర అవయవాలన్నీ బాగున్నాయని, మెదడుకు సంబంధించిన చికిత్సను త్వరలోనే చేయబోతున్నామని తాజాగా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆ ప్రకారమే నేడు తారకరత్న మెదడుకు సంబంధించి చికిత్సను వైద్యులు ప్రారంభించారు. తారకరత్న అనారోగ్యానికి గురైన రోజు నుంచి నందమూరి బాలకృష్ణ దగ్గరుండి తారకరత్న బాగోగులను చూసుకుంటూ..ఎప్పటికప్పుడు వైద్యులతో చర్చలు జరుపుతున్నారు. దీంతో బాలకృష్ణకు సినీ హీరోలు, ప్రముఖులు, తెదేపా పార్టీ కార్యకర్తలు, వైసీపీ మంత్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.