చిత్తూరు జిల్లా పుత్తూరు రూరల్ గొల్లపల్లిలో ఉపాధి హామీ, పంచాయతీ నిధులతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. గ్రామంలోని బాలింతలకు సంపూర్ణ పోషణ కిట్లు అందజేశారు. నూతన అంగన్వాడీ సెంటర్లో అన్నప్రాసన, అక్షరాభ్యాసం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. పుత్తూరు అంగన్వాడీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్‌ను ఎమ్మెల్యే సందర్శించారు.
ఇదీ చదవండీ... ఆ బెంజ్ కారు.. మంత్రి ఇంట్లోనే ఉంది: అయ్యన్నపాత్రుడు