సీఎం జగన్ పరిశ్రమలను ప్రోత్సహించడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే రోజా తెలిపారు. నగరి నియోజవర్గం నుంచి వేలాది మంది తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తున్నారని, మన గ్రామాల్లోనే పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఒక భరోసా కలుగుతుందన్నారు. అమ్మయప్పర్ కంపెనీకి మంచి పేరు ఉందని, 20 వేలమంది పనిచేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో వస్త్ర ఉత్పత్తి పరిశ్రమ ప్రారంభించడానికి ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. సుమారు మూడువేలమందికి ఉపాధి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మయప్పర్ టెక్స్ టైల్స్ ఛైర్మన్ శ్రీ కార్తిక్, ఎంపీడీవో సతీష్, ఎమ్మార్వో ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మున్సిపోల్స్: నామినేషన్ల ఉపసంహరణపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు