ఉచితంగా కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - MLA distributed vegetables for free
లాక్డౌన్ ప్రభావంతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బుధవారం నిరుపేదలకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి కూరగాయలు ఉచితంగా పంపిణీ చేశారు. నిత్యావసర సరుకులను సంచుల్లో నింపి ఇసుకగుంట గ్రామాల్లో ఉంటున్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మిక కుటుంబాలకు అందజేశారు. ఇంటినుంచి బయటకు రాకుండా కరోనా నివారణకు సహకరించాలని ప్రజలకు సూచించారు.
ఉచితంగా కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే