ETV Bharat / state

చంద్రగిరి రైల్వేస్టేషన్​ను అభివృద్ధి చేయండి: ఎమ్మెల్యే చెవిరెడ్డి - chandragiri railway station

తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం చంద్రగిరి రైల్వేస్టేషన్​ను అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్​ను ఎమ్మెల్యే చెవిరెడ్డి కోరారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. చంద్రగిరి చరిత్రాత్మక ప్రదేశం కావడం, శ్రీవారి మెట్టు మార్గానికి అతి సమీపంలో రైల్వేస్టేషన్ ఉండడంతో ఈ ప్రాంతం పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రికి తెలిపారు.

MLA chevireddy bhasker reddy
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
author img

By

Published : Jun 13, 2021, 7:22 PM IST

ఆధ్యాత్మిక ప్రదేశంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న చంద్రగిరిలోని రైల్వేస్టేషన్​ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్​ను కోరారు. తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రికి ఎమ్మెల్యే చెవిరెడ్డి వినతిపత్రం సమర్పించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరి రైల్వేస్టేషన్​ను అభివృద్ధి చేయడం ద్వారా తిరుపతి రైల్వేస్టేషన్​పై భారాన్ని తగ్గించవచ్చని కేంద్రమంత్రికి తెలిపారు. వల్లివేడు రైల్వేస్టేషన్​లో స్టాపింగ్ రద్దు చేసిన రైళ్లను ఆపేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి.

Srivari Temple in Jammu: జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి భూమిపూజ‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.