తిరుమల శ్రీనివాసుని తల్లి వకుళామాత ఆలయ నిర్మాణాన్ని రానున్న 5 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతి నగర శివార్లలోని పేరూరు బండ వద్ద నిర్మిస్తున్న వకుళామాత ఆలయాన్ని శనివారం మంత్రి పరిశీలించారు. మంత్రి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థ మూడు కోట్ల రూపాయల విరాళంతో ఆలయ నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి ఆలయంలో చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. తిరుచానూరు, తిరుమల ఆలయాల స్థాయిలో వకుళామాత ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి వివరించారు.
ఇదీ చూడండి
తిరుమలకు తగ్గుతున్న భక్తులు... దర్శనాల కొనసాగింపుపై పునరాలోచన