ETV Bharat / state

చంద్రబాబుపై రాళ్లదాడి ఓ నాటకం: మంత్రి పెద్దిరెడ్డి - చంద్రబాబు తాజా వార్తలు

తెదేపా సభలో జరిగిన రాళ్లదాడిని వైకాపాకి అంటగట్టాలని చూస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆక్షేపించారు. ఇదంతా సానుభూతి కోసం ఆడిన ఓ నాటకమని మండిపడ్డారు. దాడి చేసింది వైకాపా వ్యక్తి అయితే మేమే పోలీసులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు.

minister peddyreddy comments on cbn stone attack
చంద్రబాబుపై రాళ్లదాడి ఓ నాటకం
author img

By

Published : Apr 12, 2021, 9:54 PM IST

చంద్రబాబుపై రాళ్లదాడి ఓ నాటకమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రాళ్లదాడిని వైకాపాకి అంటగట్టాలని చూస్తున్నారన్నారు. నిజంగా దాడి జరిగి ఉంటే పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.

"దాడి చేసింది వైకాపా వ్యక్తి అయితే మేమే పోలీసులకు అప్పగిస్తాం. రాళ్లు తగిలిన వ్యక్తి అరుస్తుంటే చంద్రబాబు ఎందుకు ప్రసంగం కొనసాగించారు. రాయి తీసుకోకుండానే సీఎం జగన్‌పై చంద్రబాబు నినాదాలు చేశారు. క్షణాల్లో గవర్నర్‌ని కలుస్తున్నట్లు ప్రకటించారు. ఇదంతా సానుభూతి కోసం ఆడిన నాటకంలా ఉంది. పోలీసులు స్పందిస్తే దోషులు ఎవరో తేలుతారు. అమిత్ షా మీద రాళ్లు వేయించిన చరిత్ర తెదేపాకి ఉంది." - మంత్రి పెద్దిరెడ్డి

ఇదీచదవండి

'పోలీసులను అడ్డుపెట్టుకొని దాడులా ?..మీ రౌడీయిజానికి భయపడం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.