ఎన్‌డీబీ రుణంతో ఐదు జిల్లాల్లో చేపట్టే రహదారుల పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో గుత్తేదారు సంస్థలు అంచనా వ్యయం కంటే తక్కువకు కోట్ చేసి పనులు దక్కించుకున్నాయి.
- చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ పీఎల్‌ఆర్, ఆర్‌సీఐపీఎల్(జేవీ) అంచనా వ్యయం కంటే 2.52 శాతం అధికంగా రూ.129.33 కోట్లకు బిడ్ దాఖలు చేసి, రివర్స్ టెండరింగ్‌లో అంచనా వ్యయం కంటే 0.04 శాతం తక్కువకు కోట్ చేసి రూ.126.10 కోట్లకు పనిని దక్కించుకుంది.
- కర్నూలు జిల్లాలో పులివెందులకు చెందిన దివంగత ఎంపీ బంధువుకు చెందిన ఎన్‌ఎస్‌పీఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ అంచనా వ్యయం కంటే 4.89 శాతం అధికంగా రూ.240.01 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. రివర్స్ బిడ్డింగ్‌లో అంచనా కంటే 0.10 శాతం తక్కువ కోట్ చేసి రూ.228.59 కోట్లకు పనులను సొంతం చేసుకుంది.
- కడపలో లెఖాయ్ అండ్ నితిన్‌సాయి సంస్థ అంచనా వ్యయం కంటే 3.69 శాతం అధికంగా రూ.126.70 కోట్లకు బిడ్ వేయగా, రివర్స్ బిడ్డింగ్‌లో 0.45 తక్కువ కోట్ చేసి రూ.121.63 కోట్లకు పనులు దక్కించుకుంది.
- అనంతపురంలో కేసీవీఆర్ ఇన్‌ఫ్రా సంస్థ అంచనా వ్యయం కంటే 1.50 శాతం అధికంగా రూ.130.31 కోట్లకు బిడ్ దాఖలు చేసి, రివర్స్ టెండరింగ్‌లో అంచనా కంటే 0.23 శాతం తక్కువకు కోట్ చేసి రూ.128.36 కోట్లకు పనులు చేజిక్కించుకుంది.
- ప్రకాశం జిల్లాలో జేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ అంచనా వ్యయం కంటే 4.29 శాతం అధికంగా రూ.186.85 కోట్లకు టెండర్లు దాఖలు చేసి, రివర్స్ బిడ్డింగ్‌లో 0.19 శాతం తక్కువకు రూ.186.85 కోట్లతో టెండర్ సొంతం చేసుకుంది.
- ఐదు జిల్లాల్లో ప్రతిపాదించిన పనులకు రివర్స్ బిడ్డింగ్ నిర్వహించటం ద్వారా రూ.30.45 కోట్లు ఆదా చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: