చిత్తూరు జిల్లా గంగవరం మండలం నడిమి గొర్రెలదొడ్డి గ్రామంలో వినాయకమ్మ(40) అనే మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భర్త నాగరాజు వేధింపులు భరించలేక బలన్మరణానికి పాల్పందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు సమాచారం ప్రకారం...వినాయకమ్మ, నాగరాజు కొంత కాలం నుంచి గొడవలు పడుతున్నారు. ఈ కలహాలు తీవ్రమై ఇంట్లో ఎవరూ లేని సమయంలో వినాయకమ్మ ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా...అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినాయకమ్మ, నాగరాజు దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇదీ చదవండి : దారుణం.. తండ్రే అత్యాచారం చేసి హత్య చేశాడు!