చిత్తూరు జిల్లా తిరుపతిలోని సంధ్య థియేటర్ సమీపంలో గల లేఅవుట్లో విషాదం జరిగింది. రత్నవేలు అనే వ్యక్తిపై గోడకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. రత్నవేలు బేకరీ నిర్వాహకుడిగా పని చేస్తూ... పదేళ్లుగా అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అయితే అద్దెకి ఉంటున్న ఇల్లు కూల్చివేస్తామని ఇంటి యజమాని చెప్పటంతో రత్నవేలు రెండు రోజుల క్రితం ఇంటిని ఖాళీ చేశాడు. ఇంటిలో మరిన్ని ఇంటి సామానులు ఉన్నాయని తీసుకెళ్లడానికి వెళ్లిన రత్నవేలుపై... గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: