చిత్తూరు జిల్లా తిరుపతి ఖాదీ కాలనీలోని అపార్ట్మెంట్లో అభిషేక్ శేఖర్ (26) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని స్థానిక ఖాదీకాలనీలోని సత్యం అపార్ట్మెంట్ నందు సీబ్లాక్లో రాజశేఖర్ కుమారుడు అభిషేక్ శేఖర్ నివాసముంటున్నారు. ఇతను బీఫార్మసీ చదివి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ పనిచేస్తూ ఉండేవాడు. గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉండేవాడు. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేస్తుండగా... అతను గదిలోనే ఉన్నాడు. తర్వాత కుటుంబ సభ్యులు తలుపుతట్టి చూసేసరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దేవేంద్ర కుమార్ తెలియజేశారు.
ఇదీ చూడండి. ప్రజల మనోభావాలతో సీఎం జగన్ ఆటలాడుతున్నారు: చంద్రబాబు