సహచర నేత తన భూమిని ఆక్రమించడంతో పాటు ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని.. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలానికి చెందిన వైకాపా నేత ఇమామ్ కాసీం ఆవేదన వ్యక్తం చేశాడు. రొంపిచర్ల మండలం బొమ్మయ్య గారి పల్లెకు చెందిన ఇమామ్‌కాసీం... తమ పార్టీ నేత నాగిశెట్టి రెడ్డన్న నుంచి తనను, తన భూమిని కాపాడాలని లేకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ వాపోయారు. బొమ్మయ్యగారిపల్లె సర్వేనెంబర్ 863లో ఉన్న 2.85 ఎకరాల స్థలాన్ని ఆక్రమించేందుకు నాగిశెట్టి రెడ్డన్న యత్నిస్తున్నారని ఇమామ్ కాశీం వీడియోలో ఆరోపించారు. మంగళంపేట నూర్జహాన్ పేరుతో బోగస్ పట్టా చేయించుకొన్నారని తెలిపారు. ఆక్రమణలను ప్రశ్నించిన తన సన్నిహితులపై అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారని తను నమ్ముకున్న వైకాపా నాయకులు న్యాయం చేయకపోగా తిరిగి తనపైనే దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని.. లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: భవనంపై నుంచి దూకి బాలిక ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే ?
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!