లాక్ డౌన్ కారణంగా చిత్తూరు జిల్లాలో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడు, నెల్లూరు సరిహద్దు ప్రాంతాల వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణీలు ఆసుపత్రులకు వెళ్లడం కష్టంగా మారింది. సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం, రాచకండ్రిగ ప్రాంతాల్లో పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ గ్రామాలకు సమీప పట్టణం నెల్లూరులోని సూళ్లూరుపేట. అక్కడ ఆసుపత్రులకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి.. జిల్లా సరిహద్దుల మూసివేత: ఆర్డీవో