చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, బుచ్చినాయుడుకండ్రిగ, వరదయ్యపాలెం, తదితర ప్రాంతాల నుంచి సూళ్లూరుపేట, సరిహద్దు గ్రామాలకు వచ్చే రహదారులను మూసివేసినట్లు నాయుడుపేట ఆర్డీవో సరోజిని పేర్కొన్నారు. గూడూరు డీఎస్పీ హర్షతో కలిసి జిల్లా సరిహద్దులైన పెరిమిటిపాడు, మతకామూడి, సుగ్గుపల్లిలో మూసివేసిన ప్రాంతాలను పరిశీలించారు. శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసులు 40కి పైగా ఉన్నందున జిల్లా సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, వాలంటీర్లు, పోలీసులను కాపలాగా ఉంచినట్లు తెలిపారు.
ఇదీ చదవండి...