చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మండల వ్యాప్తంగా.. ఎవరికి వారే స్వీయ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పట్టణంలో స్వచ్ఛంద లాక్‌డౌన్ పాటిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత దుకాణాలు మూసివేస్తున్నారు. చంద్రగిరిలో పోలీసు, రెవెన్యూ, వర్తక సంఘాల ప్రతినిధులు సంయుక్తంగా నిర్ణయం తీసుకొని నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.
నేటి నుంచే పాక్షిక లాక్‌డౌన్ అమలు
వివిధ అవసరాల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల వారు చంద్రగిరికి రావడం, దుకాణాల్లో రద్దీ ఎక్కువగా ఉండటం, బస్సులు, ఆటోల్లో ప్రయాణించడం వంటి కారణాలతో కేసులు పెరుగుతున్నాయని.. సీఐ రామచంద్రారెడ్డి అన్నారు. దీనికి లాక్‌డౌన్‌తో అడ్డుకట్ట వేయొచ్చని అందరూ భావిస్తున్నారని.. అందుకే వ్యాపారుల నిర్ణయం మేరకు నేటి నుంచి పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా పోలీస్, రెవెన్యూ, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కులు ధరించాలని కోరారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: