చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీకి గోపాలపురం పాఠశాల వద్ద అధికారులు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీ పరిధిలో 8 వార్డులున్నాయి. పాఠశాలకు ఒకే భవనం ఉంది. దీంతో భవనంలో రెండు, వరండాలో రెండు, వంట గదిలో ఒకటి, షామియానాలో మరో రెండు చొప్పున పోలింగ్ బూత్‌లను సిద్ధం చేశారు. వీటిని సోమవారం జడ్పీ ఇన్‌ఛార్జి సీఈవో ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. మండలంలోని చాలా పంచాయతీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఇదీ చదవండి: చిత్తూరులో అర్ధరాత్రి వైకాపా మద్దతుదారుల ఆందోళనలు