తిరుమల మొదటి కనుమ దారిలో వేకువజామున చిరుతపులి సంచారం ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. కొండపై నుంచి కిందకు దిగే మొదటి ఘాట్ రోడ్డులో వినాయకస్వామి ఆలయం వద్ద చిరుత రోడ్డుపైకి వచ్చింది. వాహనం రాకతో ఘాట్ రోడ్డులో కొంత దూరం పరిగెడుతూ పిట్టగోడను దూకి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.
చిరుతను గమనించిన ప్రయాణికులు.. సెల్ఫోన్లలో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కొన్ని రోజులుగా కపిలతీర్థం, దివ్యారామం సమీప అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది.
ఇదీ చూడండి: MP RAMMOHAN: 'నవరత్నాలు కావవి.. బూడిద రత్నాలు..'