గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలకొండపై అక్కడక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. 12వ కిలోమీటరు వద్ద పడ్డ కొండచరియలను తొలగించే సమయంలో కొంత సమయం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. క్రేన్, జేసీబీల సాయంతో ఎప్పటికప్పుడు రాళ్లను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. బాలాజీ నగర్‌కు సమీపంలో రింగు రోడ్డు కుంగిపోయింది.
గత నాలుగు రోజులుగా కొండపై ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. వానలతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. అలిపిరి నడక మార్గంలో వచ్చే యాత్రికులు వానలో నానుతున్నారు. నడకమార్గం మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో మెట్లపై ఉన్న స్లాబ్‌ను తొలగించారు. దీంతో నడచి వస్తున్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుమదారుల్లో వాహన దారులు నెమ్మదిగా వెళ్లాలని భద్రతా సిబ్బంది సూచిస్తున్నారు.
ఇదీ చూడండి. పద్మావతి మహిళా వర్శిటీలో రేపు జరగాల్సిన పీజీ సెట్ కౌన్సెలింగ్ 18కి వాయిదా