ETV Bharat / state

పశువుల్లోనూ అంతుచిక్కని వైరస్.. దూరం పాటించాల్సిందే - పసువుల్లోనూ అంతుచిక్కని వైరస్

లంపీ స్కిన్ అనే వ్యాధి ఇప్పుడు పశువులను పట్టి పీడిస్తోంది. కరోనా వ్యాధిలాగే లంపీ స్కిన్ డిసీజ్ పశువులకు అంటువ్యాధిగా మారుతోంది. వ్యాధి సోకిన పశువులను దూరంగా ఉంచడంతో పాటు, వాటికి మేత, నీరు అందించే సమయంలో సామాజిక దూరం పాటించి ఒక పశువు నుంచి మరో పశువుకు ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పశు వైద్యులు కోరుతున్నారు.

lampi-skin
lampi-skin
author img

By

Published : Aug 31, 2020, 8:33 PM IST

చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో పశువులకు లంపీ స్కిన్ డిసీజ్ సోకింది. జిల్లా పరిధిలోని తంబళ్లపల్లె నియోజకవర్గం సరిహద్దులోని కడప జిల్లాలోనూ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. కరోనా వ్యాధిలాగే లంపీ స్కిన్ డిసీజ్ పశువులకు అంటువ్యాధిగా మారుతోంది. వ్యాధి సోకిన పశువులను దూర దూరంగా ఉంచడంతో పాటు, వాటికి మేత, నీరు అందించే సమయంలో సామాజిక దూరం పాటించి ఒక పశువు నుంచి మరో పశువుకు ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పశు వైద్యులు కోరుతున్నారు.

తంబళ్లపల్లె మండలంలో గుండ్లపల్లి, మరిమాకుల పల్లి, గంగిరెడ్డిపల్లె, గోపి దిన్నె, కొట్టాల, రేణు మాకులపల్లి గ్రామాల్లో ఈ వ్యాధి కనిపిస్తోంది. వ్యాధి సోకిన పశువులకు సకాలంలో వైద్యం అందించాలని పశువైద్యాధికారి సుజన శ్రీ తెలిపారు.

ప్రాణాపాయం లేకపోయినప్పటికీ ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు కావడంతో దీని ప్రభావంతో పశువుల్లో వివిధ రకాల జబ్బులు కనిపిస్తాయని తెలిపారు. సోమవారం మరిమాకులపల్లి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామాల్లో ఈ వ్యాధి లక్షణాలతో శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండడం, బొబ్బలు రావడం, వాపు రావడం, ఎక్కువ వేడిని తట్టుకోలేకపోవడం, నీరు, మేత మానేయడం వంటి లక్షణాలతో పశువులు కనబడితే వెంటనే తెలియజేయాలని పశు వైద్యాధికారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: సోమవారం నుంచి మళ్లీ భారీ వర్షాలు: ఐఎండీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.