చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం బాల్రెడ్డి గారి పల్లె గ్రామ పరిధిలో మోదుగుల అటవీ ప్రాంతంలోని రేల మేకల కుంట శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల కురిసిన వర్షానికి వచ్చిన నీరు వృథాగా పోతోంది. కుంట మరువ శిథిలావస్థకు చేరుకుని రాతి కట్టడాలు ఊడిపోయాయి. సాగునీటి పారుదల శాఖ అధికారులు పరిశీలించి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: రాని కరోనా పరీక్ష ఫలితం... ఆరుబయటే వైద్యం...