చిత్తూరు జిల్లా ఆంధ్రా - తమిళనాడు సరిహద్ధు ప్రాంతంలోని అప్పయ్యపాలెం, రాచపాల్యం గ్రామాల్లో మద్యం విక్రయాలు వివాదాలు సృష్టిస్తున్నాయి. ఒక వైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరో వైపు మద్యం దుకాణాల వద్ధ జనాలు గుమిగూడుతున్నారు. ఈ కారణంతో.. ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో మద్యం విక్రయాలు ఆపాలంటూ మహిళలు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు.
శ్రీసిటీ సెజ్ లోని అప్పయ్యపాలెం షాపు తొలగించకుంటే దుకాణం ఎదుటే ఆత్మహత్యలు చేసుకుంటామని మహిళలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న శ్రీసిటీ సిఐ జగదీష్ నాయక్ గ్రామస్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. అధికారులతో చర్ఛించి మద్యం షాపు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని సీఐ భరోసా ఇచ్చిన తర్వాతే మహిళలు వెనుతిరిగారు.
ఇదీ చూడండి: