లాక్డౌన్ నేపథ్యంలో భక్తుల దర్శనాలను నిలిపివేయడంతో ప్రసాదాలను... తిరుపతి పరిపాలనా భవనానికి తరలిస్తున్నారు. ప్రత్యేకంగా విక్రయ కేంద్రం ఏర్పాటు చేసి శ్రీవారి పెద్ద లడ్డు, వడలను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. స్థానికులకు శ్రీవారి ప్రసాదాలు అందించే లక్ష్యంతో తితిదే ఏర్పాట్లు చేసింది.
'పరిపాలనా భవనంలో లడ్డు విక్రయాలు' - laddu Sales in Tirumala Administrative Building
దాదాపు 55 రోజుల తర్వాత తిరుమల శ్రీవారి లడ్డును భక్తులకు తితిదే అందుబాటులోకి తెచ్చింది. మార్చి 20న శ్రీవారి దర్శనాలను ఆపివేసిన తితిదే తిరుమలలో లడ్డు తయారీతో పాటు విక్రయాలను నిలిపివేసింది. శ్రీవారి కల్యాణోత్సవ ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులకు అందజేసే పెద్ద లడ్డు, వడతో పాటు చిన్న లడ్డులను తితిదే అందుబాటులోకి తెచ్చింది. దీంతో స్ధానికులు స్వామి వారి ప్రసాదం కొనుగోలు చేసేందుకు భారీగా తరలివచ్చారు. శ్రీవారి ప్రసాదం కోసం బారులు తీరిన వైనం పై ఈటీవీ భారత్ ప్రతినిధి నారాయణప్ప మరిన్ని వివరాలు అందిస్తారు.
తిరుమల పరిపాలనా భవనంలోలడ్డు