కరోనా కేసులను నియంత్రణలోకి తీసుకొచ్చామని చిత్తూరు జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకుంటుండగా కోయంబేడు రూపంలో ఇప్పుడు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో జిల్లా పరిధిలో మొత్తం 11 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు. ఇందులో 9 మంది కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్నవారే.. కోయంబేడు నుంచి వచ్చినవారికి కరోనా బయటపడటంతో అధికారులు అప్రమత్తమై ఎంతమంది వ్యాపారులు, రైతులు అక్కడికి రాకపోకలు సాగించారనేది ఆరా తీశారు.
సుమారు 160 మందికిపైగా వెళ్లివచ్చినట్లు గుర్తించారు. వీరితోపాటు కుటుంబసభ్యులు, అనుబంధంగా ఉన్న సుమారు 1670 మంది నుంచి నమూనాలు సేకరించారు. మరోవైపు తమకూ పరీక్షలు నిర్వహించాలంటూ వి.కోటలోని మార్కెట్‌లో పనిచేసే వారు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు.
ఇవీ చూడండి...