ETV Bharat / state

శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యస్వామి తెప్పోత్సవం - aadi kruthika

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యస్వామి వారి తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది. ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈవేడుకను నిర్వహించారు.

కార్తికేయ
author img

By

Published : Jul 27, 2019, 11:48 PM IST

శ్రీకాళహస్తిలో నయనమనోహరంగా సుబ్రహ్మణ్యస్వామి తెప్పోత్సవం

ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో విజ్ఞాన గిరిపై వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. శ్రీ వళ్లి, దేవసేన సమేతుడై న సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవమూర్తులు కొలువుదీరి శ్రీ నారద పుష్కరిణిలో తెప్పలపై విహరించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ కార్యక్రమం భక్తి ప్రపక్తులతో జరిగింది. ఉత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి కుమార స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పుష్కరిణి హర నామస్మరణలతో మార్మోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి... మోడల్​ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

Intro:* పీలేరు నియోజకవర్గంలో ఘనంగా ఆడికృత్తిక ఉత్సవాలు..
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో ఆడికృత్తిక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు . ఈ సందర్భంగా శనివారo రాత్రి కలికిరి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వార్లకు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

Body:ఆడి కృత్తిక మహోత్సవాలు

Conclusion:చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం లో ఆడికృత్తిక మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కలికిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వార్లకు కన్నులపండువగా కల్యాణోత్సవం నిర్వహించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.