చిత్తూరు జిల్లా కలికిరి పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న దామోదరం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ కేసులో నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు దామోదరం లంచం డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న అనిశా అధికారులు.. ఏఎస్సై రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఇదీ చదవండి: మాజీ ఎంపీ శివప్రసాద్ వర్దంతి..ఘన నివాళులు