ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రభుత్వ సంస్థగా మార్చే దిశగా... అధికారులు, పాలకులు వ్యవహరిస్తున్నారని జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. ttdsevaonline.com గా ఉన్న వెబ్సైట్ను, tirupatibalaji.ap.gov.in గా మార్చడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
తితిదే ఆస్తులు, భూములు వేలంపాటల్లో అమ్మడానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూలను రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలకు తరలించి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత తగ్గించే యోచనలో అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారని అభ్యంతరం చెప్పారు. కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో ప్రతి జిల్లాలో లడ్డూల అమ్మకం సరికాదని చెప్పారు. ఏదైనా జరిగితే అధికారులదే బాధ్యత అన్నారు.
ఇదీ చదవండి: