ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వాలన్నదే జాతీయ జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ఉద్దేశమని ఆ కమిటీ సభ్యులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన జల్ జీవన్ మిషన్ బృందం.. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ను కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం చిత్తూరులో తాగునీటి నాణ్యత పరీక్ష ప్రయోగశాలను తనిఖీ చేశారు. వెదురుకుప్పం, పుత్తూరులలో పర్యటించి మంచి నీటి కుళాయి కనెక్షన్లను పరిశీలించారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా గ్రామాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కమిటీ సభ్యులు సూచించారు. ఓవర్ హెడ్ ట్యాంకులు కావాలంటే మంజూరు చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: