మాదక ద్రవ్యాలకు కట్టు బానిసలుగా మారి ఆరోగ్యాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారని సీఐ రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీస్స్టేషన్ ఆవరణలో యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి, కొకేన్ లాంటి మత్తు పదార్థాలు విక్రయించిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాలు మనుషుల ఆరోగ్యాలను చిత్తు చేస్తున్నాయని, ఎంతో మంది జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని, చెడు వ్యసనాలకు బానిసైతే వారి కుటుంబాలు చిన్నా భిన్నం కాక తప్పదని చంద్రగిరి సీఐ.రామచంద్రా రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు చిన్న రెడ్డప్ప, రామకృష్ణ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి...: శ్రీవారి దర్శన టికెట్లు పెంచుతున్న తితిదే