చిత్తూరు జిల్లా గంగవరం మండలం కలగటూరుకు చెందిన వెంకట్రామయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మదనపల్లె ఆర్డీవో మురళి, పలమనేరు ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. వెంకట గౌడ తెలిపారు. ఇటీవల ఆవు తొక్కిన ఘటనలో అతడు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే గౌడ తన సొంత నిధుల నుంచి వెంకట్రామయ్య అంత్యక్రియల కోసం పది వేల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లక్ష రూపాయలు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో మురళి బుధవారం పలమనేరు ఏరియా ఆసుపత్రిలో వెంకట్రామయ్యకు అందించిన చికిత్సపై వివరాలు సేకరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆవు యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: