చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలో భారీగా కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని బైరెడ్డిపల్లె ఎస్సై మునిస్వామి తెలిపారు. కైగల్ వంతెన వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. అయిదుగురు వ్యక్తులు, ఒక కారు, రెండు ప్యాసింజర్ ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలలో కర్ణాటక నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా గుర్తించినట్లు వివరించారు. వారిని అదుపులోకి తీసుకొని మద్యం, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.లక్ష ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 7,948 కేసులు