చిత్తూరు జిల్లా మదనపల్లిలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. పట్టణంలోని కురువ వంక మీద.. తహసీల్దార్ కుప్పుస్వామి ఆధ్వర్యంలో భూసర్వే జరిపారు. దాదాపు 60 అడుగుల మేర వంక ఆక్రమణకు గురైందని తెలిపారు.
కొంతమంది స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. జేసీబీ సాయంతో అధికారులు తొలగించారు. కొద్దిసేపు అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టకేలకు అక్రమంగా నిర్మించిన కట్టడాలను రెవెన్యూ సిబ్బంది తొలగించారు.
ఇదీ చదవండి: ఆఖరి మజిలీకి ఎన్నెన్నో అడ్డంకులు