కరోనా కారణంగా గతేడాది మార్చి 21 నుంచి శ్రీవారి దర్శనాలను రద్దు చేసిన తితిదే... వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత జూన్ 8 నుంచి పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనానికి అనుమతిచ్చింది. గతంలో శ్రీవారి హుండీ ఆదాయం నిత్యం రూ.2.50 కోట్లు నుంచి రూ.3.50 కోట్లు వరకు ఉండేది.
ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 40 వేలలోపే ఉంటోంది. గతేడాది జనవరిలో 22.89 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా... రూ.94.9 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వచ్చింది. ఈ ఏడాది జనవరిలో కేవలం 12.64 లక్షల మంది భక్తులు తిరుమలేశుని దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.83.87 కోట్లు సమకూరింది.
ఇదీ చదవండి:
ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ.. అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి