ETV Bharat / state

'ఆంధ్రా ఊటీ... తాగునీరు లేక అల్లాడుతోంది'

కలియుగ వైకుంఠనాథుడు కొలువైన పవిత్రమైన ప్రాంతం... చిత్తూరు జిల్లా దాహార్తితో అల్లాడుతోంది. ఎన్నడూ లేని విధంగా... నీటి ఎద్దడి జిల్లావ్యాప్తంగా కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో 10 రోజులకు ఓసారి తాగునీరు సరఫరా అవుతోంది. హంద్రీనీవా రాకతో... సాగునీటికి లోటుండదనీ... ఇక సస్యశ్యామలమేనని భావించినా... ఎగువ నుంచి నీరు రాని కారణంగా కాలువలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. బోర్లు భోరుముంటున్నాయి.

ఆంధ్రా ఊటీ... తాగునీరు లేక అల్లాడుతోంది
author img

By

Published : May 17, 2019, 9:03 AM IST

ఆంధ్రా ఊటీ... తాగునీరు లేక అల్లాడుతోంది

రాయలసీమలో కొంత సస్యశామంగా కనిపించే చిత్తూరు జిల్లా... తాగునీరు లేక అల్లాడుతోంది. సుమారు 42 లక్షల జనాభా నివసిస్తున్న ఈ జిల్లాలో.. చాలా ప్రాంతాల్లో 10 రోజులకోసారి నీరు రావడం కలవరపెడుతోంది. జిల్లా తాగునీటి అవసరాలు తీర్చే తెలుగుగంగ కాలువ, కైలాసగిరి రిజర్వాయర్, కల్యాణి జలాశయం, మదనపల్లె సమీపంలోని చిప్పిలి జలాశయం, పెనుమూరు సమీపంలోని ఎన్టీఆర్ జలాశయాల్లో నీటిస్థాయి పడిపోయింది. ఏటా మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు మండలాల్లో మాత్రమే కరవు ఛాయలు కనిపించేవి. ఈ సారి శ్రీకాళహస్తి, సత్యవేడు, జీడీ నెల్లూరు మండలాల ప్రజలు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తిరుపతి నగరంలో సుమారు 4లక్షల మంది నివసిస్తుండగా... మరో లక్ష మంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. నీరు సరఫరా చేయాల్సిన నగరపాలక సంస్థ... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సరైన నీటి నిల్వలు లేక... నాలుగు రోజులకోసారి నల్లాల ద్వారా నీరందిస్తున్నారు. శివారు ప్రాంతాలైన ఎమ్మార్ పల్లె, సరస్వతి నగర్, శ్రీ కృష్ణనగర్​ వాసులకు 15రోజులకోసారి అందించడమూ కష్టంగా మారంది. ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా... ఏ మాత్రం సరిపోవడంలేదని ప్రజలు చెబుతున్నారు.

జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా 2వేల 677 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2వేల 308 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు. 367 గ్రామాలకు వ్యవసాయ బోర్లు అనుసంధానం చేసి దాహార్తి తీర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాలని జిల్లా పాలనాధికారి పీఎస్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు.

కడప జిల్లా గండికోట రిజర్వాయర్ నుంచి పైపులైన్ల ద్వారా 2వేల 600 కోట్ల నిధులతో నీళ్లు రప్పించే ప్రయత్నాలు తుదిదశకు చేరాయి. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి...

ఎన్నికల నిబంధనలను ఈసీయే ఉల్లంఘిస్తోంది: బాబు

Intro:దేవుడు పై ఉన్న భక్తిని ఒక్కొక్కరూ ఒక్కో రకంగా కొలుస్తారు. హిందూ సంప్రదాయాలను కాపాడుకుంటూనే శ్రీరామనామ జపాన్ని పట్టిస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన కూన ధనలక్ష్మి ప్రసన్నకుమారి బియ్యపు గింజపై శ్రీరామనామాన్ని రాసి తన భక్తిని చాటుకున్నారు. మూడు నెలలకు పైగా ఇంటి పనులు చూసుకుంటూనే రోజుకి రెండు నుంచి మూడు గంటలు శ్రమించి 35,765 బియ్యపు గింజపై శ్రీరామనామాన్ని రాశారు. ధన లక్ష్మి ప్రసన్న కుమార్ కి చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక భావాలు అంటే ఎంతో ఆసక్తి భక్తిగీతాలు ఆలపించడంలో దిట్ట తన భార్య ఆసక్తిని గమనించిన ఆమె భర్త అప్పారావు కుటుంబ సభ్యులు కారణం ఎంతగానో ప్రోత్సహించారు తన భర్త సహకారంతో స్థానిక మహిళలతో సీతారామ గీతరచన భజన మండలి స్థాపించారు గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమానికి తన బృందంతో హాజరై భజనలు చేస్తూ తన భక్తి భావాలను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లో 2018 ఫిబ్రవరి లో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట వెళ్లారు ఆ సమయంలో ఆలయ ప్రధాన అర్చకుడు ధనలక్ష్మి ప్రసన్నకుమారి గురించి అడిగి తెలుసుకుని గర్భంలో తీసుకెళ్లి స్వామివారి జీతం పెంచాలని కోరారు మహా పుణ్యక్షేత్రాలు భక్తిగీతాలు లభించే అవకాశం రావడంతో ఆమె ఎంతో పొంగిపోయారు అప్పటినుంచి శ్రీరాముడు ఎలా చాటుకోవాలి ఆలోచించారు బియ్యపు గింజపై శ్రీరామ అని రాయాలనుకున్నారు తన ఆలోచనలను భర్తతో కూడా పంచుకుంది. ఆయన కూడా మంచి ఆలోచన అంటూ ప్రోత్సహించారు ఈ విధంగా లక్ష్మీ ప్రసన్న కుమారి బియ్యపు గింజపై శ్రీరామ లెక్కించడానికి కూడా ఉన్నారు అంతేకాకుండా శ్రీరామ అని రాసిన బియ్యపు గింజను మళ్ళీ శ్రీ రామ అనే ఆకారంలో బోర్డులపై అతికించారు ఒక్క బోర్డుకి 7,153 చొప్పున అన్ని నుంచి సుందరంగా తీర్చిదిద్దారు.

Body:ఉంగుటూరు

Conclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.