చిత్తూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తంబళ్లపల్లిలోని పెద్దేరు జలకళను సంతరించుకుంది. నియోజకవర్గంలోని 900 పై గా ఉన్న చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షాధార మెట్ట సేద్యం పంటలైన వేరుశనగ, చిరుధాన్యాలు, టమోటా, కూరగాయలు, మల్బరీ, ఇతర పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేసిందని రైతులు చెప్పారు. ఐదేళ్ల తర్వాత వస్తోన్న వరదను చూసి అన్నదాతలు మురిసిపోతున్నారు. ఈ వర్షాలతో వ్యవసాయ బోర్లలో నీటి మట్టంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని ఆశిస్తున్నారు. పశుగ్రాస కొరత కూడా తీరిందని తెలిపారు.
ఇదీ చూడండి : గంగానది ఉద్ధృతితో నీట మునిగిన వారణాసి