బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి నదిలోకి వరద నీరు చేరి జలకళ సంతరించుకుంది.
శ్రీకాళహస్తి మండలంలోని కాపు గున్నేరి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కింద పెద్దఎత్తున నీరు చేరి గ్రామంలోకి రాకపోకలు స్తంభించాయి. దీనిపై స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు స్పందించి నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపేందుకు చర్యలు చేపట్టారు. గత కొన్నేళ్లుగా వర్షాలు పడినప్పుడల్లా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోనందున తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు అంటున్నారు.
ఇవీ చదవండి..
తెదేపా, వైకాపాలు మతపరమైన రాజకీయాలు చేస్తున్నాయి: సోము వీర్రాజు