ETV Bharat / state

చంద్రగిరిలో భారీ వర్షానికి నీట మునిగిన కాలనీలు - chadragiri latest news

చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షంతో చంద్రగిరిలోని పలు కాలనీలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం
author img

By

Published : Sep 15, 2019, 9:58 PM IST

చంద్రగిరిలో కురిసిన వర్షానికి ...మునిగిన లోతట్టు ప్రాంతాలు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో రాత్రి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రంగంపేట పంచాయతీ సాయి నగర్ కాలనీలో ఇళ్లు నీటమునిగాయి. ఇంట్లో ఉన్న బియ్యం, పప్పు ఇతర నిత్యావసర వస్తువులు వరద నీటిలో మునిగిపోవడంతో బాధితులు లబోదిపబోమంటున్నారు. అధికారులు స్పందించి తమను తక్షణమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

చంద్రగిరిలో కురిసిన వర్షానికి ...మునిగిన లోతట్టు ప్రాంతాలు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో రాత్రి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రంగంపేట పంచాయతీ సాయి నగర్ కాలనీలో ఇళ్లు నీటమునిగాయి. ఇంట్లో ఉన్న బియ్యం, పప్పు ఇతర నిత్యావసర వస్తువులు వరద నీటిలో మునిగిపోవడంతో బాధితులు లబోదిపబోమంటున్నారు. అధికారులు స్పందించి తమను తక్షణమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చూడండి

బోటు ప్రమాదంపై సీఎం ఆరా... తక్షణ సహాయక చర్యలకు ఆదేశం

Intro:


Body:Ap-tpt-76-15-Ananthareddy Lakshyam Anantham-Avb-Ap10102


చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో ఎటు చూసిన కరువు ఛాయలే. మూడు దశాబ్దాల వరస కరువుతో భూగర్భ జలాలు పాతాళానికి చేరి బోర్లలో నీళ్లు రాని పరిస్థితి. బోర్ల మీద బోర్లు తవ్వి అప్పులు చేసి నీళ్లు రాక పంటలు దిగుబడి లేక చేసిన అప్పులు తీర్చలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరి కొందరు రైతులు ఇక్కడ బతకలేమని పట్టణాల బాట పడుతున్నారు.
ఇలాంటి ప్రాంతంలో కరువు తో పోరాటం చేయాలని వృద్ధ రైతు సంకల్పించి ఆత్మబలంతో గట్టిగా ఎదుర్కొని పోరాడి విజయం సాధించాడు, తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలం బండిరేవు కొత్తపల్లికి చెందిన రైతు అనంతరెడ్డి(70). తనకు ఉన్న 10 ఎకరాల మెట్ట భూమి లో వర్షాధారం పై పంటలు వేస్తూ వర్షాభావంతో పంటలు రాక పెట్టుబడులు పెట్టడానికి చేసిన అప్పులు తీరక మనోవేదనకు గురయ్యాడు. ఈయన కుమారుడు మల్ రెడ్డి
ఇక ఇక్కడ బతకలేమని వృద్ధులైన తల్లిదండ్రులను స్వగ్రామంలో వదిలేసి భార్యతో కలిసి బెంగళూరు నగరానికి వలస వెళ్ళాడు. అక్కడ భార్యాభర్తలిద్దరూ శ్రమించి సంపాదించిన సొమ్ముతో తండ్రి అనంత రెడ్డి కోరికమేరకు బోరు బావి తవ్వారు. మూడు మూడు ఇంచులకు పైగా నీరు ఉబికి వచ్చాయి . ఆశించిన స్థాయిలో నీరు రావడంతో కరువులో కష్టాలు పడిన ఈ రైతు కుటుంబం లో సంతోషం కనిపించింది. పదేళ్లుగా బీడుగా ఉన్న పది ఎకరాల భూమిని సాగు చేసి పచ్చని పంట తో తీర్చిదిద్దాలని సంకల్పించారు.
మోటారు అమర్చి పకృతి వ్యవసాయం నుంచి తాత్కాలికంగా విద్యుత్ సరఫరా తీసుకొని బోర్ లో నీటి సామర్థ్యం పరీక్షించారు. పండుగకు సరిపోయే నీరు పుష్కలంగా ఉందని, అధికారులు విద్యుత్తు సరఫరా ఇస్తే
బీడు భూమిని సాగులోకి తెస్తామని 70 ఏళ్లు పైబడిన వృద్ధ రైతు అనంత రెడ్డి అనంతమైన సంకల్పంతో ఉన్నారు. విద్యుత్తు సరఫరా ఇస్తే తాగునీటికి ఇబ్బంది పడుతున్నా బండిరేవు కొత్తపల్లి గ్రామస్తులకు ఉచితంగా తాగునీటిని అందిస్తామన్నారు. నడవలేని స్థితిలో మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న రైతు అనంతరెడ్డి కి కుమారుడు మల్ రెడ్డి బ్యాటరీ సైకిల్ సమకూర్చారు. గ్రామం నుంచి తాగునీటి బోరు వద్దకు అనంత రెడ్డి ఇ ఈ సైకిల్ రాకపోకలు సాగిస్తూ పది ఎకరాల బీడు భూమిని సాగులోకి తేవాలన్న ఆయన అనంత సంకల్పం అందరికీ స్ఫూర్తిదాయకం. కరువుకు భయపడి పట్టణాలకు పారిపోతే గొప్ప కాదని వెనుతిరిగి కరువు తో పోరాటం చేయాలని ఆయన ఇస్తున్న పిలుపు కరువు పీడిత రైతాంగానికి స్పూర్తిదాయకమయిన సందేశం. అందరూ ఆయన బాటలో పయనించాలని కోరుకుందాం.


Av- malreddy- AnanthaReddy kumarudu
Av- AnanthaReddy - Bandrevu kotthapalle Raithu





R.sivareddy kit no 863 tbpl ctr
8008574616


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.