Gudduru Colony People Facing Problems due to Lack of Road Repairs: ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నెన్నో హామీలిచ్చిన జగన్ సర్కార్ పదవిలోకి వచ్చిన తరువాత వాటిని విస్మరించింది. ఫలితంగా అభివృద్ధి పనులు జరగక ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధి గడ్డూరు కాలనీలో సుమారుగా రెండు వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. కాలనీ ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కనీసం రోడ్డు మరమ్మతులకు నోచుకోక, తాగు నీరు సరఫరా లేక అస్థవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Chitoor People Problems: ఎన్ని సంవత్సరాలు గడిచినా గడ్డూరు కాలనీ అభివృద్ధికి నోచుకోవడం లేదని కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తాగునీటి సమస్య కాలనీవాసులను కలవర పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా తాగడానికి నీరులేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. మున్సిపాలిటీ అధికారులు రెండు మూడు రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకర్ పెడతారని, కనీసం ఆ నీళ్లు పట్టుకుందామన్నా అనుమతి లేదంటూ నీళ్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని స్థానికులు వాపోయారు. అధికారులు తాగునీటికి అనుమతి ఇవ్వకపోవటంతో కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు.
అనగనగా ఓ ఊరు - చివరికి ఆ దంపతులు ఇద్దరే మిగిలిపోయారు 'కర్నాలపేట కథ విన్నారా!'
"నీటి ట్యాంకర్ వచ్చినప్పుడు నీళ్లు పట్టుకోవటానికి అధికారులు నిరాకరిస్తున్నారు. ఫిల్టర్ వాటర్ తీసుకొచ్చే వాహనం రోడ్డు సరిగ్గాలేక నీళ్లు తీసుకురావడానికి నిరాకరిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఇంటింటికి వాహనం ద్వారా రేషన్ అందిస్తామని చెప్పింది. రోడ్డు సరిగ్గా లేకపోవటంతో వాహనం వద్దకు వెళ్లి గంటల తరబడి రేషన్ కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకుంటోంది." -స్థానికులు
సమస్యల గురించి స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇలా అయితే మేము ఎలా బ్రతకాలి అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. గొప్పలు చెప్పే రాజకీయ నాయకులు ఒకసారి గడ్డూరు కాలనీకి వచ్చి తమ పరిస్థితులను చూడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కాలనీలోకి అంబులెన్స్ రావడానికి కూడా వీలు లేకుండా రోడ్లు అద్వాన పరిస్థితికి చేరుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధ్వానంగా ఏలూరు - కైకలూరు ప్రధాన రహదారి
డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నా అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మురుగునీరు రోడ్డుపై చేరి దుర్వాసన వెదజల్లుతోందని, దీనివల్ల రాత్రి సమయంలో దోమల తాకిడి పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన చెందారు. ఉన్నాతాధికారులు స్పందించి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఇంటింటికి నీటి వసతి కల్పించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు