ETV Bharat / state

తిరుపతి: సెల్​టవర్ ఎక్కిన ప్రభుత్వ మద్యం దుకాణం సేల్స్​మెన్ - latest news in tirupathi

ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే వ్యక్తి తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. రెండు నెలలుగా జీతాలు ఇవ్వకుండా...అధికారులు తనని వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Government liquor employee climbs cell tower Agitation in tirupathi
సెల్ టవర్ ఎక్కిన మద్యం దుకాణ ఉద్యోగి
author img

By

Published : Feb 16, 2021, 5:19 PM IST

రెండు నెలలుగా జీతాలు చెల్లించకుండా తమను మానసిక వేదనకు గురిచేస్తున్నారంటూ... తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ సమీపంలో ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. చంద్రగిరి మండలం తొండవాడ ప్రభుత్వ మద్యం దుకాణంలో చరణ్ సేల్స్​మెన్​గా పనిచేస్తున్నాడు. రెండు నెలలుగా జీతం ఇవ్వకుండా తమను వేధిస్తున్న అధికారుల తీరుకు నిరసనగా సెల్ టవర్ ఎక్కి నినాదాలు చేశాడు. సమాచారం అందుకున్న తిరుపతి తూర్పు పోలీసులు అతన్ని కిందకు దింపేందుకు ప్రయత్నించగా... ఎవరైనా తన వద్దకు వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే వారిపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్న చరణ్... ఎక్సైజ్ పోలీసుల వేధింపులకు ప్రభుత్వ మద్యం దుకాణాలు కేంద్రంగా మారయాని తన ఆవేదన వెలిబుచ్చాడు. ఇది కేవలం తన ఒక్కడి ఆవేదనే మాత్రమే కాదన్నాడు. అబ్కారీ శాఖకు సంబంధించిన ఉన్నత ఉద్యోగుల నుంచి స్పష్టమైన హామీ వస్తే తప్ప కిందకు దిగేది లేదని చెప్పాడు. పోలీసులు ఉద్యోగికి నచ్చజెప్పి కిందకు దింపే ప్రయత్నాలు చేశారు.

ఇదీ చదవండి:

రథసప్తమి రోజున శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.