చిత్తూరు జిల్లా మదనపల్లెలో ప్రేమించిన యువకుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన దీక్షకు దిగింది. రెడ్డిస్ కాలనీకి చెందిన అబిద్...బెంగళూరుకు చెందిన షబిదా అనే ఉద్యోనితో ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. తరచూ బెంగళూరు వెళ్లి యువతిని కలిసి బాగా నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని అందుకోసం డబ్బులు కావాలని అబిద్ కోరాడు.
అందుకు షబిదా అంగీకరించి సుమారు మూడు లక్షల రూపాయలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టుపట్టడంతో యువకుడు మోహం చాటేశాడు. దీంతో ఆ యువతి తనకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకోని ప్రేమించిన యువకుడి ఇంటి ముందు నిరసన చేపట్టింది.